యూనివర్సిటీ అడ్మిషన్ల నిబంధనల్లో కీలక మార్పులు
- December 22, 2022
యూఏఈ: విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT), బ్రిడ్జింగ్ కోర్సుల నుండి మినహాయింపు ఇవ్వవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT) జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిద్వారా దేశంలో, వెలుపల ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు అందిస్తారు. యూఏఈ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. తాజాగా సర్క్యులర్ నంబర్ 137 ద్వారా హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు ఈ ఎగ్జామ్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే షరతులతో కూడిన ప్రవేశాన్ని అందించవచ్చని తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!







