నిఖిల్ ‘18 పేజెస్’ గట్టిగానే బిజినెస్ చేసిందిగా.!

- December 22, 2022 , by Maagulf
నిఖిల్ ‘18 పేజెస్’ గట్టిగానే బిజినెస్ చేసిందిగా.!

నిఖిల్ సిద్దార్ధ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధియేటర్లకు సంబంధించి ఆంధ్రా, నైజాం, సీడెడ్ మొత్తం 10 కోట్ల వరకూ బిజినెస్ చేసిన ఈ సినిమా, డిజిటల్ రైట్స్ ద్వారా 22 కోట్ల వరకూ బిజినెస్ చేసింది. 
కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ‘18 పేజెస్’ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. బజ్ కూడా ఈ సినిమాకి బాగానే వుంది. కార్తికేయ 2తో నిఖిల్ దక్కించుకున్న క్రేజ్‌ ఈ సినిమాకి ఓ ప్లస్ కాగా, సుకుమార్ అందించిన కథ మరో ప్లస్ పాయింట్.
ప్రచార చిత్రాలన్నీ ప్లెజెంట్‌గా, ఆసక్తికరంగా కనిపిస్తున్నాయ్. ఇదే రోజు రవితేజ ‘ధమాకా’ చిత్రం రిలీజ్ వున్నప్పటికీ రెండూ డిఫరెంట్ కాన్సెప్టులు. సో, కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా, నిఖిల్‌కి బాగా కలిసొచ్చే అంశమే. 
రవితేజ సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలదొక్కుకోలేకపోతున్నాయ్. సో, నిఖిల్ ఈ సారి కూడా ‘కార్తికేయ 2’ లాంటి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com