ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.! మరో మెట్టు పైకెక్కబోతోందా.?
- December 22, 2022
ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’, ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోలేకపోవడం కూసింత బాధాకరమైన అంశమే.
కావాలని ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ చోటు దక్కనీయకుండా చేశారన్న ప్రచారం లేకపోలేదు. అయినా, కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా రాజమౌళి ఆస్కార్ స్థానం కోసం పాట్లు పడుతూనే వున్నాడు.
ఎట్టకేలకు ఓ ఛాన్స్ దొరికింది. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటన వెల్లడైంది. ఈ దారి ద్వారానే ‘ఆర్ఆర్ఆర్’ నామినేషన్ బరిలో సత్తా చాటాల్సి వుంది.
స్క్రీనింగ్ రిజల్ట్ ఎలా వుంటుందో.. ఎంత మంది ఓట్లు గుద్దుతారో చూడాలి మరి. ఏది ఏమైతేనేం, ఇక్కడి వరకూ తీసుకెళ్లడానికి రాజమౌళి అండ్ టీమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కష్టం ఫలించి, ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిస్తే, తెలుగు సినిమా ఖ్యాతి మరో మెట్టు పైకెక్కినట్లే.!
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







