అల్ వుస్తాలో నియోలిథిక్ కళాఖండాలు లభ్యం
- December 24, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లోని సామూహిక సమాధిలో నియోలిథిక్ కాలం నాటి కళాఖండాలు లభ్యమైనట్లు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ నుండి పురావస్తు మిషన్ సహకారంతో ఈ తవ్వకాలు నిర్వహించినట్లు పేర్కొంది. అల్ వుస్తాలోని డుక్మ్‌లోని నాఫున్ ప్రాంతంలోని పురావస్తు ప్రదేశంలో రెండవ సీజన్ త్రవ్వకాలలో మొదటి దశ కొనసాగుతుందన్నారు. నియోలిథిక్ యుగం నాటి సామూహిక సమాధిని తవ్వగా.. కుండలు, రాగి సేకరణలు, సౌందర్య సాధనాలను ఉంచే షెల్‌లతో సహా అనేక కళాఖండాలను గుర్తించినట్లు వెల్లడించింది. నఫున్ ప్రాంతంలో సుమారు 155 పురావస్తు అవశేషాలు కూడా కనుగొన్నట్లు తెలిపింది. వీటిలో రాతి శాసనాలు, సమాధులు ఉన్నాయన్నారు. మూడు రాళ్ల సమాధులు కూడా దొరికాయని, ఇవి రాళ్ల సమూహాలు, ప్రతి ఒక్కటి పిరమిడ్ ఆకారంలో మూడు నిటారుగా ఉండే రాళ్లతో కూడి ఉన్నాయన్నారు. ఇవి మతపరమైన ఆచారాలకు ఉపయోగించే వారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇనుప యుగం నాటి పురాతన వాణిజ్య మార్గాలతో ముడిపడి ఉందని కూడా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







