చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు
- December 24, 2022
చైనా: కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. కరోనా పుట్టినిల్లు చైనా లో మరోసారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఒక్క రోజే దాదాపు 3.7 కోట్ల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 4 కోట్ల మందికన్నా కూడా ప్రస్తుత సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని చైనా ఆరోగ్య వాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని బీజింగ్‌తో పాటుగా సిచువాన్ ప్రావిన్స్‌లో సగానికి పైగా నివాసితులు కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న చైనాలోని 18 శాతం జనాభాకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు నమోదుకావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం ప్రకారం.. డిసెంబర్లో మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మంది చైనా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపుగా 18 శాతం. చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గత సమావేశంలో అధికారులు ఈ అంచనా వేశారు. ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో ఈ లెక్కలు బహిర్గతమయ్యాయి. మరోపక్క అన్ని దేశాలు కరోనా ఆంక్షలు స్టార్ట్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







