టీవీ సీరియల్ సెట్లో 21 ఏళ్ల బాలీవుడ్ నటి ఆత్మహత్య
- December 25, 2022 
            ముంబై: అనేక టెలివిజన్ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించిన 21 ఏళ్ల భారతీయ నటి శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో టీవీ సీరియల్ సెట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. తునీషా శర్మ సీరియల్ చిత్రీకరణ సమయంలో వాష్ రూమ్‌కు వెళ్లి చాలా సేపటికి తిరిగి రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె రెస్ట్రూమ్లో ఉరి వేసుకుని కనిపించిందని పేర్కొన్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తునీషా 'భరత్ క వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్'తో తొలిసారిగా నటించింది. ఆమె 'ఇష్క్ సుభాన్ అల్లా', 'గబ్బర్ పూంచ్‌వాలా', 'షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్', 'చక్రవర్తిన్ అశోక సామ్రాట్' వంటి సీరియల్స్ లలో పనిచేశారు. అలాగే 'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2: దుర్గా రాణి సింగ్', 'దబాంగ్ 3' వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







