భారత్లో 2015లో 32,077 అత్యాచార కేసులు..
- April 27, 2016
భారత్లో 2015లో 32,077 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి పార్తీభాయ్ చౌదరి మాట్లాడారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం పై మేరకు అత్యాచార కేసులు నమోదైనట్లు తెలిపారు.వాటిలో 1,706 గ్యాంగ్ రేప్ కేసులు ఉన్నాయని చెప్పారు. అత్యాచార బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించనుందని చెప్పారు. హోంశాఖ పరిధిలో రూ.200 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నష్టపరిహార పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న అత్యాచార బాధితులకు పరిహారం అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







