కాజల్ నీకిది అవసరమా.? ట్రోల్ చేస్తున్న నెటిజనం.!

- December 26, 2022 , by Maagulf
కాజల్ నీకిది అవసరమా.? ట్రోల్ చేస్తున్న నెటిజనం.!

కాజల్ అగర్వాల్ చేసిన పని తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కి కారణమైంది. ఏమైంది.? నెటిజన్లతో ట్రోల్ చేయించుకునేంతలా చందమామ కాజల్ అగర్వాల్ ఏం చేసింది.? అసలు వివరాల్లోకి వెళితే, క్రిస్‌మస్ స్పెషల్‌గా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది.
కాజల్ భర్త కిచ్లూతో గాఢంగా లిప్‌లాక్ లాగించేస్తున్న ఫోటో అది. చేతిలో కొడుకు కూడా వున్నాడు. ఈ ఫోటోనే ఇప్పుడు నెటిజన్ల ట్రోల్స్‌కి గురవుతోంది. ఎంత ప్రేమ వుంటే మాత్రం ఇంత పబ్లిగ్గా లిప్‌లాక్ చేసుకోవాలా.? అంటూ నెటిజన్లు కాజల్‌ని ఆడిపోసుకుంటున్నారు.
కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది కాజల్ అగర్వాల్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com