యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మార్గదర్శకాలు

- December 28, 2022 , by Maagulf
యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మార్గదర్శకాలు

యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమాన ప్రయాణీకుల కోసం కొవిడ్ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.ఎయిర్ ఇండియా ఎక్ష్ప్రెస్స్ యూఏఈ నుంచి భారతదేశానికి ప్రయాణించే వారందరూ మాస్క్‌లను ఉపయోగించాలని, విమానాల్లో భౌతిక దూరాన్ని అనుసరించాలని ఎయిర్ ఇండియా పేర్కొంది.కొవిడ్ గైడ్లైన్స్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోస్ట్-అరైవల్ కరోనా పరీక్ష అవసరం లేదని కూడా మార్గదర్శకాలు పేర్కొన్నాయి.కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టింది.

చైనాలో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలను సేకరించి కరోనావైరస్ పరీక్షలు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నందున చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com