వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..
- December 28, 2022
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31 తర్వాత పలు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. దీనికి సంబంధించి వాట్సాప్ నుంచి ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్‌ను తొలగిస్తూ వస్తోంది వాట్సాప్. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది.
అయితే యూజర్లు వర్రీ కావాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని ఐఫోన్ మోడల్స్‌తో పాటు పలు అండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. పాత, ఔట్ డేటేడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే మొబైల్ ఫోన్‌లపైనే వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. యాపిల్, శాంసంగ్ సహా పలు మొబైల్ ఫోన్లలో డిసెంబర్ 31 నుంచి వాట్సాప్ పని చేయదని తొలుత గిజ్‌చైనా రిపోర్ట్ చేసింది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలంది. డిసెంబర్ 31 తర్వాత నుంచి వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇకపై ఆయా ఫోన్లకు రావని వెల్లడించింది.
వాట్సాప్ పేర్కొన్న 49 మోడల్స్‌లో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్‌కవర్ 2, ఏస్2 మోడల్స్ ఉన్నాయి. ఇవికాకుండా హెచ్‌టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్‌ఎల్, ఎల్‌జీ ఎనాక్ట్, ఎల్‌జీ లూసిడ్ 2 మోడల్స్‌తోపాటు ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్‌పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్‌పిరీయా మిరో, ఎక్స్‌పిరీయా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‌టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‌టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ మోడల్స్‌లో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ పని చేయదు.
సో.. ఒకసారి చెక్ చేసుకోండి.. మీరు ఏ ఫోన్ వాడుతున్నారో.. ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా వాడుతుంటే.. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలి. లేదా వాట్సాప్ వాడకం ఆపేయాలి. అంతకుమించి మరో ఆప్షనే లేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







