ప్రపంచ రికార్డును సమంచేసిన క్రీడాకారిణి
- April 27, 2016
ఆర్చరీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డును భారత క్రీడాకారిణి దీపిక కుమారి సమం చేసింది. ఇప్పటి వరకు ఆ రికార్డు దక్షిణ కొరియాకు చెందిన కి బొబే పేరు మీద ఉంది. 2015లో ఆమె 720కి 686స్కోర్ చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ఇప్పుడు అదే స్కోరును దీపిక కుమారి సైతం సాధించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో మహిళల రికర్వ్ ఈవెంట్‌లో ఆమె ఈ రికార్డును సమం చేసింది. ఇదిలా ఉండగా 2011, 2012, 2013ల్లో జరిగిన ప్రపంచకప్‌ల్లో దీపిక వరసగా వెండి పతకాలు సాధించింది. ఇదిలా ఉండగా ఆమె ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







