అంతర్జాతీయ అరైవల్స్‌లో హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ నూతన స్టోర్

- December 28, 2022 , by Maagulf
అంతర్జాతీయ అరైవల్స్‌లో హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ నూతన స్టోర్

హైదరాబాద్: GMR హాస్పిటాలిటీ మరియు రిటైల్ లిమిటెడ్ యొక్క విభాగమైన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF), ఇటీవల GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించబడిన అంతర్జాతీయ అరైవల్స్ ప్రాంతంలో తన కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. 2400 చ.మీ.లకు పైగా విస్తరించిన ఈ నూతన స్టోర్, భారతదేశంలోని అతిపెద్ద అరైవల్ డ్యూటీ ఫ్రీ స్టోర్‌లలో ఒకటి.

హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్‌ పెర్‌ఫ్యూమ్స్, కాస్మటిక్స్, సన్ గ్లాసెస్, వాచీలు, మిఠాయిలు, పొగాకు, ట్రావెల్ ఎసెన్షియల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, బహుమతులు, సావనీర్‌లను అందిస్తుంది. HDF డిపార్చర్  ప్రాంతం  ప్రస్తుత 350 చ.మీ.ల నుండి త్వరలో 1650 చ.మీ.లకు విస్తరించబడుతుంది. దీంతో మొత్తం వైశాల్యం 4050 చ.మీ. (విమానాశ్రయ పూర్తి విస్తరణ తర్వాత) అవుతుంది.

ఈ కొత్త స్టోర్ గురించి GHIAL, CEO, ప్రదీప్ పణికర్, “హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అంతర్జాతీయ ప్రయాణికులకు సాటిలేని ధరలతో ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త అరైవల్ స్టోర్ ప్రయాణీకులను ఆకర్షించే అనుభవపూర్వక అవుట్‌లెట్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాటిలేని విలువ ద్వారా కొనుగోలుదారులకు బెస్ట్-ఇన్-క్లాస్ బ్రాండ్‌లు, ఆఫర్‌లు మరియు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం.’’ అన్నారు.

అరైవల్స్, డిపార్చర్స్ రెండింటిలోనూ, హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఎలక్ట్రానిక్స్, సన్ గ్లాసెస్ మరియు గడియారాల వంటి వాటిపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. దుకాణదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి HDF చాలా పరిశోధనలు చేసింది. ఇది ప్రాడక్ట్ పోర్ట్‌ఫోలియో, ఆఫర్‌లను కస్టమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కొత్త HDF స్టోర్ అంతర్జాతీయ ప్రయాణీకుల స్వర్గధామం. ఇధి ఏడాది పొడవునా అద్భుతమైన ఆఫర్‌లతో, కొనుగోలుదారులకు మంచి విలువ అందేలా చూస్తుంది. HDF అరైవల్ కూపన్‌లపై తగ్గింపును అందిస్తుంది, ప్రయాణికులు విమానాశ్రయం నుండి వెళ్లే (డిపార్చర్) సందర్భంగా డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో వీటిని సేకరించుకోవచ్చు. వారు ఈ కూపన్‌లను చూపి తిరిగి వచ్చినప్పుడు 15% వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా భాగస్వామ్య కార్యక్రమం ద్వారా 15% తగ్గింపును కూడా అందిస్తున్నారు. ఇది హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ షాపర్‌కి అదనపు విలువ జోడింపు.

HDF  ‘క్లిక్ & కలెక్ట్’ సదుపాయం ద్వారా అంతర్జాతీయ ప్రయాణీకులు (డిపార్చర్, అరైవల్ రెండూ) తమకు కావలసిన వస్తువులను ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకొని, హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ ప్రయాణం చేసేటప్పుడు వాటిని తీసుకెళ్లవచ్చు. క్లిక్ & కలెక్ట్ సౌకర్యంతో సాధారణ ధర కంటే అదనంగా 10% తగ్గింపును పొందొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com