రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లంట.! ఎప్పుడో తెలుసా.?
- December 28, 2022
తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు మూడు పదుల వయసులోకి అడుగు పెడుతోన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ యంగ్ హీరో జాకీ భగ్నానితో గత కొన్నాళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. జాకీతో పార్టీలకూ, ఫంక్షన్లకూ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది. కానీ, పెళ్లి మాటెత్తితే దాటేసేస్తోంది.
మొన్నా మధ్య రకుల్ సోదరుడు జాకీతో రకుల్ పెళ్లిని కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇంతవరకూ మంచి ముహూర్తం కుదరలేదు. కానీ, త్వరలోనే రకుల్ పెళ్లి చేసుకోబోతోందని తాజాగా ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే, పెళ్లి డేట్ ఇంకా రివీల్ కాలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు రకుల్ చేతిలో వున్నాయ్ ప్రస్తుతం. మరి ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసి పెళ్లి పీటలెక్కుతుందా.? లేక, పెళ్లితో పాటే, సమాంతరంగా కెరీర్‌నీ కంటిన్యూ చేస్తుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







