చిరంజీవి సెన్సాఫ్ హ్యూమర్.! ఊర్వశి..ఓ అయస్కాంతం.!
- December 28, 2022
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ‘బాస్ పార్టీ..’ అంటూ సాగే ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది ఆడియో పరంగా.
లేటెస్ట్గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ ప్రెస్ మీట్లో ఊర్వశి రౌతెలా కూడా హాజరైంది. నిండైన చీరకట్టులో అందంగా ఈ ప్రెస్ మీట్‌కి వచ్చింది ఊర్వశి రౌతెలా. ఆమె గురించి మాట్లాడుతూ, చిరంజీవి.. ఊర్వశిని అయస్కాంతంగా అభివర్ణించారు. ‘షేక్ హ్యాండ్ ఇస్తూ, చెయ్యి అతుక్కుపోయింది... ఇంకా నయ్యం చేతికే పెట్టుకుంది అయస్కాంతం.. గుండెల్లో పెట్టుకోలేదు..’ అంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ పండించారు. చిరు హ్యూమర్‌కి అక్కడంతా నవ్వులు చిందించాయి.
‘వాల్తేర్ వీరయ్య’ ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ అని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చిత్ర యూనిట్ తెలియజేషింది. చిరంజీవి ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు వింటేజ్ లుక్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని మెప్పిస్తారనీ, ఆయన ఎనర్జీ, గ్రేస్ చూసి, సెట్లో అందరూ చాలా చాలా యాక్టివ్‌గా పని చేశారనీ డైరెక్టర్ బాబీ తెలిపారు. జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







