‘వీర సింహం’ గర్జన మొదలెట్టలేదేల.!
- December 29, 2022
బాలయ్య డబుల్ ధమాకా చూపిస్తున్నారు. ఓ వైపు ‘అన్‌స్టాపబుల్ 2’ సీజన్‌తో ఫుల్ బిజీగా వున్నారు. ఎక్కడ విన్నా బాలయ్య అన్‌స్టాపబుల్ 2 టాక్ షో మార్మోగిపోతోంది.
మరోవైపు సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా గర్జించేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య. సంక్రాంతి పోటీ ఈ సారి మామూలుగా లేదు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఒకే బ్యానర్‌పై వస్తున్న రెండు పెద్ద సినిమాలూ ఒకే సారి రిలీజ్ కావడం అంత ఆషా మాషీ విషయం కాదు. ప్రొడ్యూసర్లు చాలా ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది. మొన్నటి ప్రెస్ మీట్ ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లను నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లి వదిలింది.
ఇక, ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ ప్రమోషన్లను కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతకు రెండు సినిమాలూ రెండు కళ్లలాంటివి అంటూ మొన్న చిరంజీవి చేసిన వ్యాఖ్యల ద్వారా రెండు సినిమాలపైనా నిర్మాతలు సమానమైన, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, బాలయ్య ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్ 2’ సీజన్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. నెట్టింట్లో ఈ టాక్ షో ద్వారా జరుగుతోన్న చర్చ ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం జరిగే చర్చతో పోల్చితే ఎక్కువగా వుందని మాట్లాడుకుంటున్నారు.
బహుశా, ఆ టాక్ షోకి ప్రబాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా రావడమే అందుకు కారణమేమో. ఇక, సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ, బాలయ్య ‘వీర సింహం’ పైనా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..