దుబాయ్ కు తరలివస్తోన్న పర్యాటకులు
- December 31, 2022
            యూఏఈ: న్యూ ఇయర్‌ని స్వాగతించడానికి దుబాయ్ సిద్ధమైంది. పర్యాటకులతో దుబాయ్ వీధులు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించడానికి పర్యాటకులు దుబాయ్‌కి తరలి రావడంతో, ఎమిరేట్ పర్యాటక రంగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రధాన ఈవెంట్ల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. దుబాయ్‌లో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. బుర్జ్ ఖలీఫా వద్ద నిర్వహించే బాణసంచా వేడుకలను తిలకించేందుకు వేలాది మంది సందర్శకులు ఆసక్తి చూపుతారు.
మరోవైపు విదేశీ సందర్శకులు భారీగా రావడం వల్ల దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు కిటకిటలాడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గుండా దాదాపు రెండు మిలియన్ల మంది ప్రయాణీకులు వచ్చిపోతారని అంచనా వేస్తున్నారు. రోజువారీ సగటు ట్రాఫిక్ 245,000 మంది ప్రయాణీకులకు చేరుకోవడంతో దుబాయ్ ఎయిర్ పోర్టులు గరిష్ట ప్రయాణ సలహాను జారీ చేసింది. జనవరి 2న 257,000 మంది ప్రయాణీకుల రద్దీతో అత్యంత రద్దీగా ఉండే రోజుగా అంచనా వేస్తున్నారు.
“అందమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రస్తుతం ఎమిరేట్‌ను సందర్శిస్తున్న చాలా మంది పర్యాటకులతో దుబాయ్ చాలా బిజీగా ఉంది. షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఫుట్‌ఫాల్‌ను ఆనందిస్తున్నాయి. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, బుర్జ్ ఖలీఫా వంటి పర్యాటక స్థలాలు వద్ద నిర్వహించే ఈవెంట్లకు బుకింగ్‌లకు విపరీత డిమాండ్ ఉంది. వచ్చే ఐదు-ఆరు రోజులలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల బుకింగ్‌లు పూర్తి కానున్నాయి.” అని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







