ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు పార్టీకి భారీ విరాళం
- January 03, 2023
దోహా: ఖతార్ లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ(QATAR NRI TDP) నాయకులు స్వదేశానికి వెళ్ళి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ప్రశంసిస్తూ తమ మద్దతు తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నిధికి 10 లక్షల రూపాయలను, వైద్య సహాయార్థం 5.5 లక్షలు ( పార్టీ ఆఫీసుకి అర్జీలు పెట్టుకున్న 15 మందికి 15 చెక్కులు రూపంలో) అధినేత చంద్రబాబుకు ఖతార్ ఎన్ ఆర్ ఐ టిడిపి అధ్యక్షుడు గొట్టిపాటి రమణ, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్ నేతృత్వంలోని ప్రవాసీ ప్రతినిధి బృందం అందించింది. ఈ కార్యాక్రమానికి ఖతర్ నుండి గొట్టిపాటి రమణ ఆయన సతీమణి లక్ష్మి, మద్దిపోటి నరేష్, విజయ్ భాస్కర్ దండ, కొడాలి సుధాకర్ ఆయన సతీమణి, వెంకప్ప భాగవతుల మరియు పలువురు సభ్యులు హాజరు అయ్యారు.
పార్టీ నిధికి మరియు కార్యకర్తల వైద్యసహాయానికి అడిగిన వెంటనే సత్వరం స్పందించి విరాళాల్ని అందించినందుకు చంద్రబాబుతో పాటు సీనియర్ పార్టీ నాయకులు అశోక్ బాబు, పట్టాభి, డాక్టర్.రవి వేమూరి, బుచ్చిరాం ప్రసాద్, చప్పిడి రాజ శేఖర్ ఖతర్ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఖతర్ బృందం తెలియజేసింది.
15.5 లక్షల రూపాయలను పార్టీ నిధికి, తెలుగుదేశం కార్యకర్తల వైద్య సహాయ నిధికి అందించినందుకు ఖతర్ తెలుగుదేశం శాఖ సభ్యులకు పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ,ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్ రావు, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







