27 మంది ఎన్ఆర్ఐలకు ప్రవాసీ అవార్డులు...

- January 03, 2023 , by Maagulf
27 మంది ఎన్ఆర్ఐలకు ప్రవాసీ అవార్డులు...

న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలు దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయులు 27 మంది ప్రముఖులకు భారత ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.27 మంది ఎన్ఆర్ఐ ప్రముఖులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. భూటాన్‌లోని ఓ విద్యావేత్త, బ్రూనైలో ఒక వైద్యుడు,ఇథియోపియా, ఇజ్రాయెల్, పోలాండ్‌లోని పౌర సమాజ కార్యకర్తలు సహా 27 మందిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో భాగంగా వీరికి రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 17వ ఎడిషన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 8-10వతేదీల మధ్య జరగనుంది.వివిధ రంగాల్లో భారత ప్రవాసులు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది.

అవార్డు గ్రహీతల్లో ఆస్ట్రేలియాకు చెందిన జగదీష్ చెన్నుపాటి (సైన్స్ అండ్ టెక్నాలజీ),భూటాన్‌కు చెందిన సంజీవ్ మెహతా(ఎడ్యుకేషన్‌), కళ సంస్కృతిలో బ్రెజిల్‌కు చెందిన దిలీప్ లౌండో, విద్యలో అలెగ్జాండర్ మలియాకెల్ ఉన్నారు. మెడిసిన్‌లో బ్రూనైకి చెందిన జాన్, కమ్యూనిటీ సంక్షేమంలో కెనడాకు చెందిన వైకుంటం అయ్యర్ లక్ష్మణన్, కళ, సంస్కృతిలో క్రొయేషియాకు చెందిన జోగీందర్ సింగ్ నిజ్జర్, ఐటీలో డెన్మార్క్‌కు చెందిన రామ్‌జీ ప్రసాద్, సమాజ సంక్షేమంలో ఇథియోపియాకు చెందిన కన్నన్ అంబలంలున్నారు.కమ్యూనిటీ సంక్షేమంలో జర్మనీకి చెందిన అమల్ కుమార్ ముఖోపాధ్యాయ, రాజకీయాలు,సమాజ సంక్షేమంలో గయానాకు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, వ్యాపారం, సమాజ సంక్షేమంలో ఇజ్రాయెల్‌కు చెందిన రీనా వినోద్ పుష్కర్ణ, విద్యలో జపాన్‌కు చెందిన మక్సూదా సర్ఫీ షియోటానీ, విద్యలో మెక్సికోకు చెందిన రాజగోపాల్ అవార్డులు అందుకోనున్నారు.

వ్యాపారంలో పోలాండ్‌కు చెందిన కైలాష్ చంద్ర లాత్, సమాజ సంక్షేమంలో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన పర్మానంద్ సుఖుమల్ దాస్వానీ, వ్యాపారంలో సింగపూర్‌కు చెందిన పీయూష్ గుప్తా, సమాజ సంక్షేమంలో మోహన్‌లాల్ హీరా, దక్షిణ సూడాన్‌కు చెందిన సంజయ్‌కుమార్ శివభాయ్ పటేల్ లను ప్రవాసి అవార్డులు లభించనున్నాయి.శ్రీలంకకు చెందిన శివకుమార్ నడేసన్ (కమ్యూనిటీ వెల్ఫేర్), సురినామ్‌కు చెందిన దేవన్‌చంద్రభోస్ శర్మన్ (కమ్యూనిటీ వెల్ఫేర్), స్విట్జర్లాండ్‌కు చెందిన అర్చన శర్మ (సైన్స్ అండ్ టెక్నాలజీ), ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఫ్రాంక్ ఆర్థర్ సీపర్‌సాద్ (కమ్యూనిటీ వెల్ఫేర్), యూఏఈకి చెందిన సిద్ధార్థ్ బాలచంద్రన్ (వ్యాపారం), యూకేకు చెందిన చంద్రకాంత్ బాబూభాయ్ పటేల్ (మీడియా), యూఎస్‌కి చెందిన దర్శన్ సింగ్ ధలీవాల్ (వ్యాపారం, సమాజ సంక్షేమం), యూఎస్‌కి చెందిన రాజేష్ సుబ్రమణ్యం (వ్యాపారం), ఉజ్బెకిస్థాన్ (బిజినెస్) అశోక్ కుమార్ తివారీలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుల నామినేషన్లను పరిశీలించి, అవార్డు గ్రహీతలను ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com