చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్ షాట్లే: సీఎం జగన్
- January 03, 2023
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై విరుచుకపడ్డారు. రీసెంట్ గా చంద్రబాబు నిర్వహించిన టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.కందుకూరు లో 8 మంది , గుంటూరు లో ముగ్గురు మరణించారు. ఈ తొక్కిసలాట వెనుక వైస్సార్సీపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపణల ఫై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంపేది చంద్రబాబే.. మొసలికన్నీరు కార్చేది ఆయనే అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్‌షాట్లు, డ్రామాలు.. సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో డ్రోన్ షాట్ల కోసం 29 మందిని పొట్టనబెట్టుకున్నారని జగన్ అన్నారు.
కందుకూరులో జనాన్ని ఎక్కువ చూపించేందుకు చిన్న సందులో ప్రజల్ని నెట్టారు, తన డ్రోన్ షాట్లు, ఫొటో షూట్ల కోసం 8 మందిని చంపేశారని ఆరోపించారు. తన ప్రచారం యావ కోసం చంద్రబాబు సభలు, పుష్కరాల్లో ప్రజలను బలితీసుకున్నా పవన్ కళ్యాణ్ కానీ , చంద్రబాబు అనుకూల మీడియా గాని దీనిపై స్పందించారని జగన్ మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తాడు. ఫోటోషూట్, డ్రామాలే చంద్రబాబు నైజాం అన్నారు. చంద్రబాబు తప్పు చేసి పోలీసులదే తప్పు అంటాడు. కందుకూరిలో 8 మంది చనిపోయిన, దాహం తీరనట్లు గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు’ అని సీఎం విమర్శల వర్షం కురిపించాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







