ఓ కాలమా....

- January 03, 2023 , by Maagulf
ఓ కాలమా....

ఓ కాలమా కాసేపాగుమా... 
నీ పరుగునీదే అన్నిటిని మరువమని 
ఒడిదుడుకులు ఒత్తిడులు అధిగమించి
కన్న కలలు సాకారం చేసుకోమని 
సంతోషసరాగాల కి దారిచూపుతు...

జీవితాన్ని మించిన గురువు 
అనుభవాలు నేర్పిన పాఠంలేదని 
ఎన్నోమధురక్షణాలు పరాజయాలు 
తీపి ఙ్ఞాపకాలు చేదు గుళికలు 
అపజయాలు బాధపెట్టిన 
కనురెప్ప పాటులో గడచిన ఏడాది ....

ఓర్పు సహనం విశ్వాసమనే నమ్మకంతో 
సరికొత్త లక్ష్యాలు ప్రణాళికల ధ్యేయంతో 
ముందుకు సాగుతూ కాంతుల దారుల్లో
జీవనపయనం ఎలా సాగాలో నిబధ్ధతతో 
దిశానిర్ధేశం చేసుకుంటూ కాలగతిలో.....

బతుకుపోరులో కొత్తదనానికి 
తీయనిపిలుపుతో స్వాగతిస్తు 
రాగద్వేషాలు విడనాడి కొత్త ఊసులు 
ఊహలతో ఆశకన్న ఆశయమే ముఖ్యంగా 
సంకల్పబలంతో వేద్దాం కొత్త అడుగు ....

శ్రమిస్తు ఏదైనా సాధించటమే కర్తవ్యంగా 
భావిస్తు మంచిమార్గమందు సలక్షణంగా 
సమాయత్తమవుతు సరికొత్త ఆనందాలకి 
పలుకుదాము స్వాగతము.....

(యామిని కోళ్ళూరు,అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com