నిరుద్యోగ బీమా పథకం.. నమోదుకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్
- January 03, 2023
యూఏఈ: నిరుద్యోగ బీమా పథకంలో నమోదుకు అర్హత ఉన్న యూఏఈలోని ఉద్యోగులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ని ఖరారు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం గ్రేస్ పీరియడ్ 2023 జూన్ 30తో ముగుస్తుంది. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ రంగ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్న ఎమిరాటీలు, ప్రవాసుల కోసం 2023 జనవరి 1న ఈ పథకంలో నమోదు ప్రారంభమైంది. అలాగే, బీమా చేసిన వ్యక్తి/కార్మికుడు జనవరి 1 తర్వాత తేదీలో ఉద్యోగంలో చేరినట్లయితే, నిరుద్యోగ బీమా పథకంలో సభ్యత్వం పొందడానికి నాలుగు నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఉద్యోగులు 2023 జూన్ 30 లోపు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. లేని పక్షంలో Dh400 జరిమానా విధించబడుతుంది. మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నేతృత్వంలోని బీమా పథకంలో అతి తక్కువ నెలవారీ ప్రీమియంలు Dh 5 నుండి Dh10 వరకు అందుబాటులో ఉన్నాయి. బీమా చేసిన వ్యక్తి ఉద్యోగం కోల్పోయినట్లయితే మూడు నెలల పాటు వారి ప్రాథమిక వేతనాలలో 60 శాతం మొత్తాన్ని పొందుతారు. కాగా, క్రమశిక్షణా చర్య లేదా రాజీనామా తో ఉద్యోగం కోల్పోయిన వారు ఈ పథకానికి అనర్హులు. నగదు పరిహారానికి అర్హత పొందేందుకు బీమా చేసిన వ్యక్తి కనీసం 12 వరుస నెలల పాటు తప్పనిసరిగా సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







