రియాద్ లో క్రిస్టియానో రొనాల్డో
- January 03, 2023
సౌదీ: పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(37) మంగళవారం సౌదీ అరేబియాలోని అల్ నాసర్ క్లబ్‌లో వేలాది మంది అభిమానుల ముందు తన గ్రాండ్ ఆవిష్కరణకు ముందు రియాద్ చేరుకున్నారు. మాంచెస్టర్ యునైటెడ్‌ను విడిచిపెట్టిన రొనాల్డో.. మంగళవారం రాత్రి 7:00 గంటలకు (1600 GMT) రియాద్‌లోని అల్ నాస్ర్ లోని 25,000 సామర్థ్యం గల మెర్సూల్(Mrsool) పార్క్ స్టేడియంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు క్లబ్ తెలిపింది. రోనాల్డోను అల్-నాసర్ అభిమానులకు.. క్లబ్ ప్రెసిడెంట్ ముసల్లి అల్-ముఅమ్మర్ పరిచయం చేయనున్నారు. తొమ్మిది సార్లు సౌదీ లీగ్ ఛాంపియన్ అయిన అల్ నాస్ర్ క్లబ్ కు రోనాల్డో ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో ముందుగా అల్ నాస్ర్ క్లబ్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







