మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!

- January 04, 2023 , by Maagulf
మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!

కువైట్: మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాస రోగుల రెసిడెన్సీని పునరుద్ధరణపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సమీక్ష నిర్వహించనున్నది. వారి రెసిడెన్సీని పొడిగించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక  ఆదేశాలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసుల పేర్లతో ఇప్పటికే జాబితా రూపొందించింది. వారి అనారోగ్యం తీవ్రతను బట్టి వారిని వర్గీకరించింది. దీర్ఘకాలిక మానసిక అనారోగ్యాలు ఉన్నవారు, చిన్న సమస్యలకు చికిత్స పొందుతున్నవారితో జాబితాను రూపొందించినట్లు సమాచారం. నివేదిక ప్రకారం, దేశంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో దాదాపు 9,272 మంది ప్రవాసులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com