దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. Dh3.67 మిలియన్లను గెలుచుకున్న ఇద్దరు భారతీయులు

- January 04, 2023 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. Dh3.67 మిలియన్లను గెలుచుకున్న ఇద్దరు భారతీయులు

దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB)లో జనవరి 4న జరిగిన డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో ఇద్దరు భారతీయులిద్దరూ US$1 మిలియన్ (Dh3.67 మిలియన్లు) గెలుచుకున్నారు. వారిలో ఒకరు - దుబాయ్ నివాసి సాగర్ ఆనంద్ భాటియా. 20 సంవత్సరాలుగా విమానాశ్రయంలో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2012లో దుబాయ్‌కి వెళ్లే ముందు అబుధాబిలో పుట్టి పెరిగిన భాటియా.. ప్రమోషన్ కోసం టిక్కెట్లు కొనడం మిస్ కావద్దని తన తండ్రి తనకు ఎప్పుడూ గుర్తు చేసేవారని చెప్పారు. “ఇది నా జీవితాన్ని మార్చే విజయం. ఇది నా కుటుంబ జీవితాలతో పాటు నా వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది. నేను ఇతర వ్యక్తులకు కూడా సహాయం చేయాలనుకుంటున్నాను. ”అని తన స్వంత టెక్నికల్, ఇంజనీరింగ్ సరఫరా సంస్థను నడుపుతున్న ఆనంద్ భాటియా వివరించారు. జనవరి 16న తన పుట్టినరోజును భాటియా జరుపుకోనున్నారు.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో విజేతగా నిలిచిన మరో భారతీయుడు హైదరాబాద్‌లో ఉన్న కూరాకుల దవీడు. 53 ఏళ్ల అతను రెండేళ్లుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దావీడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి $1 మిలియన్ గెలుచుకున్న 203వ, 204వ భారతీయ జాతీయులుగా భాటియా, దవీడు నిలిచారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టిక్కెట్ కొనుగోలుదారులలో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉంటారు.

2 లగ్జరీ వాహనాలు

మిలీనియం మిలియనీర్ డ్రా తర్వాత, రెండు లగ్జరీ వాహనాల కోసం ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రా నిర్వహించబడింది. యూఎస్లోని ఫ్లోరిడాలో ఉన్న ఒక అమెరికన్ జాతీయుడు డేనియల్ అబ్రహం మెర్సిడెస్ బెంజ్ S500ని గెలుచుకున్నాడు. అజ్మాన్‌లో ఉన్న 37 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడు సేలం యాకుబ్ BMW F 850 GS అడ్వెంచర్ మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com