బాలయ్య-పవన్ ‘అన్‌స్టాపబుల్’.! ఊరించి ఊరించి తుస్ మనిపించి.!
- January 04, 2023
బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో ఈ మధ్య తెగ పాపులర్ అయిపోయింది. ఈ టాక్ షో గురించి ఇండియా మొత్తం చర్చించుకునేంతలా ఫేమస్ అయిపోయింది.
అందుకు కారణం, ఈ టాక్ షో ద్వారా పలువురు పాపులర్ సెలబ్రిటీల(సినీ, రాజకీయ ప్రముఖులు)ను స్టార్ హీరో బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయడమే. ఇక, ఈ టాక్ షో రెండో సీజన్‌కి సంబంధించి మొదటి కంటెస్టెంట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎపిసోడ్ ఓ రేంజ్‌లో సక్సెస్ అయితే, ఇటీవల ప్రబాస్‌తో చేసిన ఎపిసోడ్ నెక్స్‌ట్ లెవల్ సక్సెస్ అందుకుంది.
కాగా, త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేసినట్లు ఆల్రెడీ సోషల్ లీకుల ద్వారా రివీల్ అయిపోయింది. పవన్ ఎపిసోడ్‌ని సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ యాంగిల్‌లోనే సంకేతాలు కూడా అందాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’ టీమ్‌తో షూట్ చేసిన ఎపిసోడ్ స్ర్టీమింగ్ చేయాలని ఆహా నిర్వాహకులు అనుకుంటున్నారట.
పవన్ ఎపిసోడ్‌ని జనవరి 26కి పోస్ట్‌పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్‌ని టెలికాస్ట్ చేసేందుకు రిపబ్లీక్ డే కన్నా మంచి సందర్భం ఇంకేముంటుంది అని కొందరు అనుకుంటుంటే, సంక్రాంతికి స్పెషల్ ట్రీట్‌గా పవన్ ఎపిసోడ్ వీక్షించొచ్చని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఫ్యాన్స్‌ని ఈ న్యూస్ డిజప్పాయింట్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







