అవయవ మార్పిడిపై ఒమన్ కీలక హెచ్చరికలు
- January 05, 2023
మస్కట్ : మానవ అవయవ మార్పిడి కోసం బ్లాక్ మార్కెట్కు వెళ్లవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రజలను హెచ్చరించింది. ఇది రోగి ప్రాణానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. బ్లాక్ మార్కెట్ నుంచి అవయవాలు పొందడం వల్ల రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా ఇది చట్టవిరుద్ధమైన చర్య అని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మానవ అవయవాలకు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించకుండా ‘షిఫా’ యాప్ ద్వారా అవయవ దానం కోసం నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
ఇటీవల అవయవ దానాలను ప్రోత్సహించడానికి MoH జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. 'అవయవ దానం ప్రాముఖ్యతపై కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ ప్రచారం లక్ష్యం. ఎందుకంటే ఇది ఒక మానవతా చర్య. మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాల వైఫల్యాలతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. ' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 7,092 మంది అవయవదానం కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. 2021 డిసెంబర్లో మరణానంతర అవయవ దానం కోసం దాతలు తమను తాము ‘షిఫా’ యాప్లో నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించారు. 1988 నుండి సుల్తానేట్లో 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







