పోలీసు అధికారిపై బెగ్గర్ దాడి.. జైలుశిక్ష, బహిష్కరణ
- January 05, 2023
బహ్రెయిన్: ముహర్రఖ్ గవర్నరేట్‌లో భద్రతా చర్యలో భాగంగా తన విధిని నిర్వహిస్తున్న పోలీసుపై దాడి చేసిన బిచ్చగాడికి ఒక సంవత్సరం జైలు శిక్ష, అనంతరం బహిష్కరణ విధించిన శిక్షను హైకోర్టు ఆఫ్ అప్పీల్ సమర్థించింది. ముహరఖ్‌లోని ఖలాలీలోని ఒక ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ కొందరు బెగ్గర్స్ ని అరెస్టు చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఒక మస్జీదు ముందు నిల్చున్న నిందితుడిని చూసిన పోలీసు అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లారు. పోలీసులు వస్తున్నారని పసిగట్టిన నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించినా నిందితుడిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రాసిక్యూషన్‌కు తరలించారు. నిందితుడు మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నించాడు, కానీ పోలీసులు అడ్డుకున్నారు. సెప్టెంబరులో భద్రతా దళాల సభ్యునిపై దాడి చేసినట్లు అతనిపై అభియోగాలు మోపారు. ఈ దాడి కారణంగా పోలీసు అధికారి అనారోగ్యానికి గురై 20 రోజులపాటు విధులు నిర్వహించలేకపోయాడు. నిందితుడిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచి, ఆ తర్వాత దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు తీర్పు చెప్పింది. అప్పీల్ కోర్టు ఈ తీర్పును తాజాగా సమర్థించింది.
తాజా వార్తలు
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం







