రేపు విశాఖ కు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే

- January 05, 2023 , by Maagulf
రేపు విశాఖ కు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు వైజాగ్ వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీ రావు బుధువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించనున్నారు.

రేపు(గురువారం) ఉదయం 6 గంటలకు తులసీరావు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన యలమంచిలికి తరలించనున్నారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీ ని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

ఇక జగన్ షెడ్యూల్ విషయానికి వస్తే..గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైయ‌స్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. ఆయన తండ్రి, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com