హజ్.. దేశీయ యాత్రికుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- January 06, 2023
రియాద్ : సౌదీ అరేబియాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ హజ్ 1444 కోసం దేశీయ యాత్రికుల రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. దేశీయ యాత్రికుల ప్యాకేజీల ధర SR3,984 నుండి ప్రారంభమవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది హజ్ యాత్ర చేయాలనుకునే సౌదీలు, నివాసితులు తమ వెబ్‌సైట్ లేదా నుసుక్ యాప్ ల ద్వారా రఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది.
దేశీయ యాత్రికుల కోసం మంత్రిత్వ శాఖ మొత్తం నాలుగు ప్యాకేజీలను ప్రకటించింది. మొదటి ప్యాకేజీ ధర 10,596 నుండి 11,841 వరకు, రెండవది 8,092 నుండి 8,458కి, మూడవది 13,150, యాత్రికులకు ఆర్థిక సేవలను అందించే నాల్గవ ప్యాకేజీ ధర SR3,984. అన్ని రకాల ప్యాకేజీ ధరలలో విలువ ఆధారిత పన్ను (VAT) ఉంటుంది. దరఖాస్తుకు కనీస వయస్సు 12 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గతంలో హజ్ చేయని దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నట్లయితే, గతంలో హజ్ చేసిన వారికి కూడా అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్‌పాట్ గెలిచిన రెండవ విజేత..!!







