ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా దుబాయ్
- January 07, 2023
దుబాయ్: పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఆర్థికాభివృద్ధిలో ప్రపంచ అత్యుత్తమ నగరాల నివేదికలో దుబాయ్ ఐదవ ఉత్తమ నగరంగా.. గల్ఫ్ రీజియన్ లో మొదటి ఉత్తమనగరంగా నిలిచింది. ఈ మేరకు రెసొనెన్స్ కన్సల్టెన్సీ గ్లోబల్ సిటీలకు ర్యాంక్ లను ప్రకటించింది. ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను ర్యాంకింగ్ కోసం ఎంపిక చేశారు. ఆయా నగరాల్లోని స్థానికులు, పర్యాటకుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఉత్తమ నగరాలను ఎంపిక చేసినట్లు రెసొనెన్స్ కన్సల్టెన్సీ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ ఫెయిర్ తెలిపారు.
వాతావరణం, భద్రత, ల్యాండ్‌మార్క్‌లు, అవుట్‌డోర్ కార్యకలాపాలను మూల్యాంకనం చేసే ప్లేస్ విభాగంలో దుబాయ్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. దుబాయ్‌ని ఓవర్-ది-టాప్ అనుభవాలు, అరబ్ వారసత్వం, విలాసవంతమైన షాపింగ్‌ల ఆకట్టుకునే సమ్మేళనంగా నివేదిక ప్రశంసించింది. డీప్ డైవ్ దుబాయ్ - ప్రపంచంలోని అత్యంత లోతైన పూల్, దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, మహ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ, దుబాయ్ క్రీక్, ది పామ్, ఐన్ దుబాయ్, సిటీల్యాండ్ మాల్, ది ఆరా స్కైపూల్ - ప్రపంచంలోని మొదటి, అత్యధిక 360-డిగ్రీల ఇన్ఫినిటీ పూల్ లాంటి ఆకర్షణలు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
అన్ని కేటగిరీలలోని మొత్తం ర్యాంకింగ్స్‌లో లండన్, పారిస్, న్యూయార్క్, టోక్యో, దుబాయ్, బార్సిలోనా, రోమ్, మాడ్రిడ్, సింగపూర్, ఆమ్‌స్టర్‌డామ్ టాప్ 10 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గల్ఫ్ రీజియన్ లో దోహా 27వ స్థానంలో ఉండగా, అబుధాబి ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రజల శ్రేయస్సు సూచికలో ఖతార్ రాజధాని మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ రాజధాని ఐదవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







