ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత్‌పై పోరుకే
- April 28, 2016
ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా చట్టసభ అగ్ర సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ యుద్ధ విమనాలను ఉగ్రవాదంపై పోరుకు కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించవచ్చన్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల సంఘంలోని ఆసికా, పసిఫిక్ వ్యవహారాల ఉసంఘం ఆధ్వర్యంలో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌పై బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తనతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు ఈ యుద్ధవిమానాలను విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రశ్నించారని కాంగ్రెస్ సభ్యుడు మాట్ సాల్మన్ చెప్పారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు ఎఫ్-16 విమానాలు పాకిస్థాన్‌కు సరైనవేనా, తక్కువ వ్యయంతో కూడుకున్నవేనా, భారత్-పాకిస్థాన్ మధ్య అధికార సంతులనానికి పెద్దగా అవరోధం కలిగించని ఆయుధ వ్యవస్థా కాదా అన్న విషయాన్ని మనం పరిశీలించాలి అని మరో సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు మాత్రమే యుద్ధ వ్యవస్థలను తయారు చేసి ఇవ్వాలి తప్ప భారత్‌తో యుద్ధం కోసం పనికొచ్చే విమానాలను కాదని ఆయన అన్నారు. ఈ విమానాలను విక్రయించడం వెనక ఉన్న అసలు ఉద్దేశమేమిటి? విక్రయించాలనుకుంటున్న సమయం సరైనదేనా? ఈ నిర్ణయం అమెరికాకు ఎలా ప్రయోజనం కలిగిస్తుంది? అన్న అంశాలపై వివరణ ఇవ్వాలని ఒబామా ప్రభుత్వానికి ఈ ఉపసంఘంలో ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్ ఓల్సన్‌ను సాల్మన్ కోరారు. 2009లో అఫ్గానిస్థాన్‌లో అమెరికన్లపై జరిగిన దాడిలో పాకిస్థానీ తాలిబన్ల ప్రమేయముందని, ఆ ఉగ్రవాదులపై కచ్చితమైన దాడిని చేసే సామర్థ్యాన్ని పాకిస్థాన్ వృద్ధి చేసుకుందని, ఆ వ్యవస్థను ఎఫ్-16లో వాడుతుందని ఓల్సన్.. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







