కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక భారతీయుడు సహా నలుగురు ప్రవాసులు మృతి

- January 10, 2023 , by Maagulf
కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక భారతీయుడు సహా నలుగురు ప్రవాసులు మృతి

కువైట్: సాల్మియా ప్రాంతంలోని బాలాజత్ స్ట్రీట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు సహా నలుగురు ప్రవాసులు మృతి చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి కువైట్ పౌరుడు నడుపుతున్న కారు సాల్మియా ప్రాంతంలోని బాలాజత్ స్ట్రీట్‌లో వర్షాల కారణంగా అదుపు తప్పి కాంక్రిట్ బ్యారియర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ప్రవాసులను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయ, ఈజిప్షియన్, జోర్డానియన్, ఆఫ్రికన్ పౌరుడు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న మరికొందరికి గాయాలయ్యాయి. కారును నడిపిన డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com