యూఏఈలో విద్యార్థులకు 21 రోజులపాటు స్ప్రింగ్ బ్రేక్
- January 10, 2023
యూఏఈ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండవ, మూడవ టర్మ్‌లలో 21 రోజులపాటు స్పింగ్ బ్రేక్ రానుంది. అలాగే ఈద్ అల్ ఫితర్‌కు నాలుగు రోజులు, ఈద్ అల్ అదాకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ESE) ఆమోదించిన రెండవ, మూడవ సెమిస్టర్‌ల పాఠశాల క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు స్ప్రింగ్ బ్రేక్ (ఇది రెండవ సెమిస్టర్ ముగింపును సూచిస్తుంది) మార్చి 27 నుండి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు 21 రోజుల పాటు కొనసాగుతుంది. విద్యార్థులు ఏప్రిల్ 17న మూడవ టర్మ్ సెమిస్టర్ క్లాసుల కోసం పాఠశాలలకు తిరిగి వస్తారు. అదే సమయంలో ఉపాధ్యాయులకు ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 16 వరకు 16 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 17న వారు పాఠశాలలకు రావాల్సి ఉంటుంది.
యూఏఈ కేబినెట్ ఆమోదించిన అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈద్ అల్ ఫితర్ సెలవులు రమదాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ఉన్నాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం.. ఇవి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉంటాయి. వాస్తవ తేదీలు చంద్ర దర్శనానికి లోబడి ఉంటాయి. ఈద్ అల్ అదా సెలవులు (అరాఫా డే, ఈద్ అల్ అధా) జూన్ 27 నుండి జూన్ 30 వరకు ఉన్నాయి. పాఠశాల క్యాలెండర్ దేశంలోని అన్ని పాఠశాలలో వేసవి సెలవులు 8.2 వారాలకు మించకూడదని విద్యాశాఖ మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. సంవత్సరంలో కనీసం 182 రోజులపాటు బోధన సాగాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!