ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అల్-మొహన్నది కన్నుమూత

- January 10, 2023 , by Maagulf
ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అల్-మొహన్నది కన్నుమూత

ఖతార్: ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, పశ్చిమ ఆసియాకు AFC వైస్ చైర్ పర్సన్ అయిన సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-మొహన్నాది అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతికి ఖతార్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ HE షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ సంతాపం తెలిపారు.  అల్-మొహన్నాది దేశానికి పూర్తి చిత్తశుద్ధితో సేవలు అందించాడని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.యూనియన్ ఆఫ్ అరబ్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, ఫిఫా కౌన్సిల్ సభ్యుడిగా కూడా అల్-మొహన్నాది సేవలు అందించారు. ఖతార్ తోపాటు ఆసియా, ఇంటర్నేషనల్  స్థాయిలో పలు స్పోర్ట్స్ కేడర్ లలో పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com