ఈ ఏడాది 11 భాషల్లో స్ట్రీమ్ కానున్న ఐపీఎల్..
- January 10, 2023
ఈ ఏడాది ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ 11 భాషల్లో జరగనుంది. ఇంతకుముందు ఐపీఎల్ ఆరు భాషల్లోనే స్ట్రీమ్ కాగా, ఇకపై 11 భాషల్లో ప్రసారం చేసేందుకు వయోకామ్ 18 సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాదికి సంబంధించి ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని వయోకామ్ 18 సంస్థ దక్కించుకుంది.
బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల్ని స్టార్ట్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది వయోకామ్ 18 సంస్థకు చెందిన ‘వూట్’ యాప్‌లో ఐపీఎల్ స్ట్రీమింగ్ కానుంది. గతంలో డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అయ్యేది. ఈ యాప్‌తో పోలిస్తే వూట్ యాప్‌నకు సబ్స్క్రైబర్ల సంఖ్య తక్కువ. అందుకే సబ్స్క్రైబర్లను పెంచుకునే ఉద్దేశంతో వూట్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐపీఎల్‌ను 11 భాషల్లో ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. స్థానిక భాషల్లో ప్రసారం చేయడం ద్వారా అక్కడి వీక్షకులకు దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా భాషలు మాట్లాడే వాళ్లు కూడా యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇంతకుముందు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఐపీఎల్ స్ట్రీమ్ అయ్యేది.
ఇకపై ఈ భాషలతోపాటు, భోజ్‌పురి వంటి భాషల్లో కూడా ప్రసారం చేయాలని వయోకామ్ 18 సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయోకామ్ 18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మొత్తం తిరిగి రాబట్టడం కష్టమే అని విశ్లేషకుల అంచనా. అందుకే ఇతర భాషల్లో అందుబాటులోకి తేవడం ద్వారా సబ్స్క్రైబర్లను పెంచకోవడంతోపాటు, దాని ద్వారా అదనపు ఆదాయం పొందాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై 500 మిలియన్ల మంది వీక్షిస్తారని అంచనా.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







