భారతదేశ పురోగతిలో ప్రవాసులది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- January 10, 2023
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరుగుతున్న17వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల ముగింపు సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న 27 మంది విదేశీ భారతీయులను ఆమె సత్కరించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. భారతదేశ పురోగతిలో ప్రవాసులది కీలకపాత్ర అని చెప్పారు.విదేశీ భారతీయులకు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. చాలా కాలం తర్వాత నేరుగా ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు నిర్వహించడం జరిగిందని, ఇందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ముర్ము అన్నారు.
ప్రవాసీ భారతీయ దివస్ కోసం కోసం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రముఖులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రవాసీ భారతీయ దివస్ అనేది భారతదేశాన్ని, ప్రవాస సమాజాన్ని కలిపే ప్రత్యేకమైన వేదికని అన్నారు.మహాత్మా గాంధీ జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారని, అతని జ్ఞాపకార్థం ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటారని చారిత్రక విషయాలను మరోసారి రాష్ట్రపతి గుర్తుచేశారు.అమృత్ కాల్లో భారతదేశం పురోగతిలో విదేశీ భారతీయులు ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారని అభినందించారు.విదేశీ భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రవాసులను కూడా దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దాదాపు 70 వేర్వేరు దేశాల నుండి 3,500 మంది ప్రవాస సభ్యులు ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ కోసం నమోదు చేసుకున్నారు.ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల ముగింపు సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా పర్సాద్ సంతోఖి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







