నభా నటేష్ కనిపించడం లేదు.! ఎందుకో తెలుసా.?
- January 10, 2023
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ భామ నభా నటేష్. ‘అదుగో’, ‘అల్లుడు అదుర్స్’ తదితర సినిమాల్లో నటించింది.
పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఇస్మార్ట్ బ్యూటీ అనిపించుకుంది. అలా వచ్చిన క్రేజ్‌తో సోషల్ మీడియాలోనూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుందీ అమ్మడు.
అయితే, గత కొన్నాళ్లుగా నభా నటేష్ అడ్రస్ గల్లంతైపోయింది. అందుకు కారణం తాజాగా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది నభా నటేష్. గతేడాది తనకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందనీ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరాననీ షాకిచ్చింది నభా నటేష్.
షోల్డర్ సర్జరీతో పాటూ, కొన్ని ఎముకలు కూడా విరిగిపోయాయనీ ఇప్పుడిప్పుడే కోలుకున్నానంటూ నభా నటేష్ ఓ పోస్ట్ షేర్ చేసింది. భుజానికి సర్జరీ గాయం వున్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. అయ్యో పాపం నభా.! అంత జరిగిందా.! అని నెటిజన్లు సానుభూతి ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







