పోయి భోజ్‌పురి సినిమాలు చేస్కో.! రష్మిక పై ఘాటైన ట్వీట్.!
- January 10, 2023
హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ దక్కించుకుంది రష్మికా మండన్నా. దాంతో పాటే, బోలెడన్ని కాంట్రవర్సీలకు కారణమైంది రష్మిక మండన్నా. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది రష్మిక.
తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఆర్కే, రష్మికనుద్దేశించి చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నీ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండని ‘లైగర్’ సినిమాతో తరిమికొట్టాం.. అలాగే నిన్ను కూడా అడ్రస్ లేకుండా చేస్తాం బాలీవుడ్లో..’ అంటూ ఆర్కే ట్వీటారు.
అంతేకాదు, నువ్వు భోజ్‌పురి సినిమాలకే పనికొస్తావ్.. అని కూడా ఆయన నోరు పారేసుకున్నారు తన ట్వీట్ ద్వారా. గతంలోనూ పలువురు సెలబ్రిటీలను ఇదే విధంగా దారుణంగా అవమానించారాయన. సడెన్‌గా రష్మికపై ఆయన దృష్టి మళ్లిందెందుకో.
రష్మిక బాలీవుడ్లో జోరు ప్రదర్శించడం బహుశా ఆయనకు నచ్చలేదు కాబోలు. అందుకే ఇంత దారుణంగా. ఈ ట్వీట్‌కి రష్మిక ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







