భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం..పృథ్వీ-II
- January 11, 2023
న్యూ ఢిల్లీ: భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. భారత్ సరిహద్దు దేశాలు తోక జాడిస్తున్న క్రమంలో భారత్ క్షిపణుల పరీక్షల్లో సక్సెస్ అవుతూ..భారత్ దాయాది పాకిస్థాన్ తో పాటు చైనాకు కూడా చెక్ పెడుతోంది. ఈక్రమంలో మరో క్షిపణి ప్రయోగంలో భారత్ సక్సెస్ అయ్యింది. అదే ద గ్రేట్ ‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ ప్రయోగంలో విజయం సాధించింది.
దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం (జనవరి 10,2023) రాత్రి ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది.
పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని..350 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది. స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతు దాదాపు 350 కిలోమీటర్ల రేంజ్ లోని టార్గెట్ ను ఛేధించగలదని వెల్లడించింది. ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ కావటంతో భారత ఆర్మీలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







