తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా..
- January 11, 2023
హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదాపడింది.ఈ నెల 19న హైదరాబాద్ కు రావాల్సిన మోడీ పర్యటన వాయిదా పడింది. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జనవరి 19న రావాల్సి ఉంది.ఈ కార్యక్రమంతో బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ పర్యటన వాయిదా పడింది.ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లను కూడా తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతోపాటు పలు రాజకీయ కార్యక్రమాలు కూడా మోడీ పర్యటనలో భాగంగా ఫ్లాన్ చేశారు.కానీ ఈ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోడీ వేరే ప్రొగ్రామ్స్ వల్ల తెలంగాణ పర్యటన వాయిదా పడిందని తెలిపారు. ఈ పర్యటన వాయిదా పడింది తప్ప క్యాన్సిల్ కాలేదని త్వరలోనే ఈ పర్యటన తేదీని ఖరారు చేసిన వెల్లడిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







