విజిట్ వీసా పై యూఏఈలో ఉన్న ప్రవాసుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చా?

- January 11, 2023 , by Maagulf
విజిట్ వీసా పై యూఏఈలో ఉన్న ప్రవాసుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చా?

దుబాయ్: యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది నివాసితులకు అత్యంత ప్రాధాన్యతలలో ఒకటి. జూలై 2020లో విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం దుబాయ్‌లో 2.5 మిలియన్లకు పైగా యాక్టివ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎమిరాటీలు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ప్రవాసులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్‌లో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మూడు నుండి ఐదు నిమిషాలలో లైసెన్స్ రెన్యూవల్ పూర్తవుతుంది. ఆమోదించబడిన కేంద్రంలో కంటి పరీక్ష చేయించుకుని, ఆర్టీఏ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీ వివరాలను నమోదు చేసి, జరిమానాలను క్లియర్ చేసి, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కంటి పరీక్ష, డెలివరీ రుసుముతో కలిపి ఇందుకోసం Dh400 వరకు అవుతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో  ప్రవాసులు తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోలేరు. ఇక్కడ కొన్ని సాధారణ ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం.

హోల్డర్ విజిట్ వీసాలో ఉన్నట్లయితే లైసెన్స్‌లను పునరుద్ధరించవచ్చా?

రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విజిట్ వీసాపై యూఏఈలో ఉన్నవారు డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించలేరు. దీని అర్థం ఒక నివాసి యూఏఈ నుండి వెళ్లి విజిట్ వీసాపై తిరిగి వస్తే లైసెన్స్ పునరుద్ధరణకు అనర్హులు అవుతారు. డ్రైవింగ్ లైసెన్స్‌ని పునరుద్ధరించడానికి కచ్చితంగా వ్యక్తి చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీని కలిగి ఉండాలి.

హోల్డర్ మరొక ఎమిరేట్ నుండి వీసా కలిగి ఉంటే దుబాయ్‌లో జారీ చేసిన  లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చా?

ఆర్టీఏ ప్రకారం, మరొక ఎమిరేట్‌లో వీసాలు జారీ చేయబడిన నివాసితులు తమ దగ్గర ఉన్న దుబాయ్ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవచ్చు.

మరొక ఎమిరేట్‌లో జారీ చేయబడిన లైసెన్స్‌లను దుబాయ్‌లో పునరుద్ధరించవచ్చా?

అలా చేయలేము. మరొక ఎమిరేట్‌లో జారీ చేయబడిన లైసెన్స్‌లను దుబాయ్‌లో పునరుద్ధరించుకునే అవకాశం లేదు.

లైసెన్స్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?

యూఏఈలోని పోలీసులు 24 బ్లాక్ పాయింట్ల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసినా లేదా సస్పెండ్ చేసినా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరీక్ష కోసం దరఖాస్తు NOC లేఖను పొందాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త ట్రైనింగ్ ఫైల్ తెరవబడుతుంది.

లైసెన్సు గడువు 10 సంవత్సరాల కంటే ముందు ఉంటే పునరుద్ధరణ ప్రక్రియ ఏమిటి?

రోడ్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించగలరు. ఇందు కోసం Dh200 శిక్షణ ఫైల్ ఓపెనింగ్‌కు చెల్లాంచాలి. అలాగే Dh100 లెర్నింగ్ అప్లికేషన్ ఫీజు; హ్యాండ్‌బుక్ కోసం Dh 50; ఆర్టీఏ  పరీక్ష కోసం Dh200; పత్రాన్ని పునరుద్ధరించడంలో ఆలస్యం కోసం Dh500; పునరుద్ధరణ కోసం Dh300, నాలెడ్జ్-ఇన్నోవేషన్ ఫీజు కింద Dh20 చెల్లించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com