తమిళ నాట ఆ పెద్ద సినిమాలకు బిగ్ షాక్.!

- January 11, 2023 , by Maagulf
తమిళ నాట ఆ పెద్ద సినిమాలకు బిగ్ షాక్.!

సంక్రాంతికి తమిళంలో స్టార్ హీరోలు అజిత్, విజయ్ బాక్సాఫీస్ వద్ద పోరుకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు అనగా, జనవరి 11 బుధవారం ఈ రెండు పెద్ద సినిమాలూ తమిళ బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయ్. 
అయితే, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు, అది కూడా సంక్రాంతి వంటి పెద్ద పండగల నేపథ్యంలో అదనపు షోలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటుంటారు.
అయితే, ‘వారిసు’, ‘తుళివు’ సినిమాలకు కేవలం 11, 12 వ తేదీల్లోనే అదనపు షోలకు అనుమతి లభించింది. పండగ సందర్భంగా అంటే 13, నుంచి 16 వరకూ ఎలాంటి అదనపు షోలూ ప్రదర్శించడానికి అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ధియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు వంటివి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గించరాదని నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అదేంటో, ఈ సారి సంక్రాంతి ఈ తమిళ సినిమాలకు తెలుగులోనే కాదు, సొంత గడ్డపైనా షాకుల మీద షాకులిస్తోందేంటో.! అజిత్ సినిమా ‘తెగింపు’ పేరుతో తెలుగులో విడుదలైంది. కానీ, విజయ్ సినిమా ‘వారసుడు’ అర్ధాంతరంగా పోస్ట్‌పోన్ అయిపోయిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com