హజ్ చేసేందుకు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందే: సౌదీ

- January 13, 2023 , by Maagulf
హజ్ చేసేందుకు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందే: సౌదీ

రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే యాత్రికులు కోవిడ్-19 టీకాలు అన్ని మోతాదులను పూర్తి చేయాల్సి ఉంటుందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అదేవిధంగా ఈ సంవత్సరం హజ్ యాత్రికులు మెనింగోకాకల్ వ్యాక్సిన్, సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా పొందాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హజ్ ఆచారాలను నిర్వహించడానికి ఆరోగ్య అవసరాలు, యాత్రికుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఏదైనా అంటు వ్యాధులతో బాధపడకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో మూడు సంవత్సరాల తర్వాత అన్ని వయసుల యాత్రికులకు హజ్ చేసందుకు అనుమతి ఇచ్చినట్లు హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com