టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై..
- January 14, 2023
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. రాబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్ టోర్నీల తర్వాత ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సానియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీ ద్వారా తన కెరీర్‌ను ముగించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా పాల్గొంటారు. ఆస్ట్రేలియా టోర్నీలో ఆమె డబుల్స్ ఆడనున్నారు. కజకిస్తాన్ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి డబుల్స్‌లో సానియా ఆడుతారు.
నిజానికి గతేడాది యూఎస్ ఓపెన్ సందర్భంగానే సానియా రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నారు. కానీ, అప్పట్లో ఆమె గాయం కారణంగా అది సాధ్యం కాలేదు. అందుకే ఈ సారి మంచి టోర్నీ ద్వారా కెరీర్ ముగించాలని సానియా నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా గాయం కారణంగా తన కెరీర్ ముగియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలో జరగబోయే తన చివరి టోర్నీల కోసం ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సానియా వివరించారు.
36 ఏళ్ల సానియా మీర్జా తన అంతర్జాతీయ కెరీర్లో డబుల్స్ విభాగంలో ఎక్కువగా రాణించారు. తన కెరీర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ వంటి టైటిల్స్ గెలుచుకోగా, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు.
తాజా వార్తలు
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు







