ఎమిరాటీ రైతులపై ప్రశంసలు కురిపించిన షేక్ హమ్దాన్
- January 14, 2023
యూఏఈ: వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తున్న ఎమిరాటీ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్, అభివృద్ధి, పౌరుల వ్యవహారాల ఉన్నత కమిటీ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రశంసలు కురిపించారు. పామ్ పార్క్స్లో జరుగుతున్న రైతుల సౌఖ్ రెండో సీజన్ను ఆయన సందర్శించారు. తమ ఆహార భద్రతా వ్యూహం లక్ష్యాలను సాధిస్తూ.. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా స్థానిక వినియోగదారుల డిమాండ్ను తీర్చడం చాలా ముఖ్యమైనదని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం నాయకత్వం ముఖ్య ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీ ప్రారంభించిన ఫార్మర్స్ సౌక్ ఉచిత వ్యవసాయ, సామాజిక, పెట్టుబడి వేదిక. ఇది ఎమిరాటీ రైతులను ఒకే వేదిక దగ్గరకు చేర్చి స్థానిక ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. ఈ మార్కెట్ మార్చి 11, 2023 వరకు పామ్ పార్క్స్లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







