జబల్ షామ్స్ లో 0°Cకి పడిపోయిన ఉష్ణోగ్రతలు

- January 15, 2023 , by Maagulf
జబల్ షామ్స్ లో 0°Cకి పడిపోయిన ఉష్ణోగ్రతలు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని చాలా ప్రాంతాలను చల్లటి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా జబల్ షామ్స్ లో ఉష్ణోగ్రతలు 0°Cకి పడిపోయాయి. దీంతో ఒమన్ ఎత్తైన శిఖరం వద్ద గడ్డకట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. సుల్తానేట్‌లోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా సైక్ (8.4 ° C) నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బిడియా (11.3 ° C), సమైల్ (11.7 ° C), నిజ్వా (11.8 ° C) ఉన్నాయి. మరోవైపు ధోఫర్ గవర్నరేట్‌లో తక్కువ స్థాయిలో మేఘాలు కమ్ముకుంటున్నాయని, తీరప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ డైరెక్టరేట్ జనరల్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com