ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశం
- January 16, 2023
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలనీ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐదు వేల ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత స్కూళ్లల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ రెడీ అవుతుంది.
నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి ఒక్కొ లైబ్రరీకి 120 పుస్తకాలు అందించాలని విద్యశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసిన తర్వాత 6 లక్షల పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. గవర్నమెంట్ టెస్ట్‌బుక్ ప్రెస్ ద్వారా ముద్రించి ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాలు అందించనుంది. విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ‘తొలిమొట్టు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని భావించింది. లైబ్రరీలలో వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. రోజూ 15 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ కూడా కొత్తగా ప్రవేశపెడతారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను విద్యార్థులు చదివేలా చర్యలు చేపట్టనున్నారు.
లైబ్రరీలు ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, విద్యార్థుల్లో పుస్తకాల పట్ల మక్కువ పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







