బిల్డింగ్ పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల మూడో అంతస్థు నుంచి కింద పడిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్,బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్‌లో ఉంటున్న కస్టమర్‌కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు. అయితే, వాళ్ల ఫ్లాట్ నుంచి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ , రిజ్వాన్‌పైకి దూసుకొచ్చింది. ఈ కుక్కను తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు.
ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆ కుక్క యజమాని, కస్టమర్ అయిన వ్యక్తి రిజ్వాన్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందిన రిజ్వాన్ ఆదివారం మరణించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రిజ్వాన్ మరణం పై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రిజ్వాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







