పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా

- January 18, 2023 , by Maagulf
పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా

యూఏఈ: రస్ అల్ ఖైమాలో 10 ఏళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేయడంతోపాటు  తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కుతుండగా బలవంతంగా ఈడ్చుకెళ్లినందుకు ఓ తండ్రిని రస్ అల్ ఖైమా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి Dh11,000 జరిమానా విధించడంతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనకు జరిగిన నైతిక, భౌతిక నష్టాలకు 60,000 దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు వ్యక్తి మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలను వినిపించారు. తన క్లయింట్ తన కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ అతని మాజీ భార్య కోర్టు రూలింగ్‌కు కట్టుబడి ఉండకపోవడమే కాకుండా నివాసాన్ని సైతం మార్చారని, ఇదే ఘటనకు మూల కారణమని కోర్టుకు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి దాడిలో 10 ఏళ్ల కొడుకు, అతని మాజీ భార్యకు తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్య నివేదిక స్పష్టం చేయడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com