యూఏఈలో జనవరి 22న ఆకాశంలో అరుదైన దృశ్యం

- January 18, 2023 , by Maagulf
యూఏఈలో జనవరి 22న ఆకాశంలో అరుదైన దృశ్యం

యూఏఈ: ఈ వీకెండ్ లో ఆకాశంలో రెండు గ్రహాలు ఒకేసారి కనిపించి కనువిందు చేయనున్నాయి. ఆదివారం నాడు శుక్రుడు, శనిగ్రహాలను ఒకే సమయంలో చూసే అరుదైన అవకాశం రానుంది. సూర్యాస్తమయం తర్వాత గంటన్నర పాటు ఆకాశంలో ఇవి కనిపిస్తాయని ఎమిరేట్స్ ఖగోళ శాస్త్ర బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. ఆకాశంలో మేఘాలు లేకుంటే వీటిని నేరుగా కంటితో చూడవచ్చన్నారు. అయితే, టెలిస్కోప్ ద్వారా గ్రహాలు మరింత స్పష్టంగా ఆకాశంలో కనిపిస్తాయన్నారు. "సాయంత్రం నక్షత్రం"గా పేరుగాంచిన శుక్ర గ్రహం మరింత ప్రకాశవంతంగా కనిపించి అలరిస్తుందని తెలిపారు. శని, శుక్ర గ్రహాలు 0.4 డిగ్రీల దూరంలోనే కనిపిస్తాయన్నారు. అలాగే జనవరి 25, 26 తేదీలలో చంద్రుడు, బృహస్పతి దగ్గరగా వస్తాయని వివరించారు. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి నెలల తరబడి సాయంత్రం సమయంలో ఆకాశంలో చంద్రుడి సమీపంలో నేరుగా చూడవచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com